Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemభద్రాచలంలో భవనం కూలి ఘోర ప్రమాదం..

భద్రాచలంలో భవనం కూలి ఘోర ప్రమాదం..

Loading

  • ఆరుగురు మృతి

భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో, మార్చి 26

భద్రాచలంలో ఘోర ప్రమాదం బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు అందిస్తున్నారు. ఆరుగురు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ భవనం ఎవరిది..?, ఎందుకు కూలిందనే కోణంలో విచారిస్తున్నారు. నాణ్యతా లోపం వల్లే కుప్పకూలి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనం కూలిన సమయంలో భారీ శబ్ధం వచ్చినట్లు వారు తెలిపారు. చనిపోయిన వారు రోజు వారీ కూలీలుగా గా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page