![]()
ములుగు, మన భద్రాద్రి న్యూస్, మే 18
వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పావులు కడుపుతుంది. ఇందులో భాగంగా ఎన్నికల కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ బృందం 18 మందిని కో – ఆర్డినేటరులుగా నియమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీ కో – ఆర్డినేటర్ గా టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములును నియమిసస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు ఏవైనా, అభ్యర్థి ఎవరైనా వారి గెలుపు కోసం అధిష్టానం ఇచ్చిన భాద్యతలు నిర్వహిస్తానని, తనపై నమ్మకంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీ కో – ఆర్డినేటర్ గా ఇచ్చిన బాధ్యత నిర్వర్తించి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపిస్తానని నాగా సీతారాములు ధీమా వ్యక్తం చేశారు.


