![]()
- ఎటు చూసినా చెత్త దిబ్బలే..పట్టించుకోని అధికారులు
- అపరిశుభ్రంతో దోమలు విజృంభన
తిరుమలాయపాలెం, మన భద్రాద్రి న్యూస్
ఒక పక్క ప్రభుత్వం గ్రామలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే అధికారుల నిర్లక్ష్యమో, పాలకుల వైఫల్యామో కానీ ఆ గ్రామం కంపు కొడుతుంతుంది. అయినప్పటికీ తప్పనిసరిగా భరించాల్సిందే అని అక్కడికి వచ్చే పలు గ్రామాల ప్రజలు అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ ఎక్కడో మారుమూల ప్రాంతము కాదు, వెనుకబడిన ప్రాంతము కాదు, అదే మన తిరుమలాయపాలెం మండల కేంద్రం. ఇటు ఎంపీడీవో కార్యాలయానికి అటు తహసిల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనె దుర్గంధం వెదజల్లుతుంది. అపరిశుభ్రత వల్ల దోమలు విజృంభిస్తున్నప్పటికీ మండల అధికారులలో ఎటువంటి చలనం లేదు. నెలల తరబడి పారిశుధ్య పనులు చేపట్టకపోవడం తో డ్రైనేజిల్లో పూడికలు, విధుల్లో ఎక్కడకిక్కడే చెత్త పేరుకుపోయి చెత్తకుప్పలు దర్శనమిస్తు దుర్గంధం వెదజల్లడంతోపాటు దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. వివిధ రకాల పనులకు వస్తున్నటువంటి ప్రజలు అనారోగ్యం బారిన పడి పలు రకాలైన వ్యాధులకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. గ్రామంలో ఇంత జరుగుతున్న ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని పట్టించుకొకపోవడం విచారకరం. అసలే వర్షాకాలం, దీనికి తోడు విషజ్వరాలు విజృంభిస్తున్నా అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదంటూ మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని గ్రామంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించి, భవిష్యత్తులో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


