![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 21
మండల కేంద్రంలో మే 15 న వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ వారి ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సంయుక్తంగా మెగా కంటి వైద్య శిభిరం నిర్వహించిన విషయం పాఠకులకు విధితమే. ఈ కంటి వైద్య శిభిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేసుకున్న వారికి కళ్లద్దాలను బుధవారం ఉదయం 10 గంటలకు గుండాల గ్రామంలోని వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్ల నివాస ప్రాంగణంలో పంపిణీ చేయబడుతుందని మంగళవారం ఆయన తెలిపారు. కావున కంటి పరీక్షలు చేయించుకొని అద్దాలకు సిఫార్సు చేసిన వారు వచ్చి తీసుకోగలరని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.


