![]()
-సిపిఎం
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, జూన్ 11
గత ఐదు సంవత్సరాలుగా సిఎస్పి బస్ లోని దేవులపల్లి యాకయ్య నగర్, సున్నం రాజయ్యనగర్ లలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలకు త్రాగునీరు అందించడంలో మండల అధికారులు విఫలం చెందారని, గత ఐదు సంవత్సరాలుగా మండల పరిషత్ సమావేశాలలో సైతం విజ్ఞప్తులు చేస్తున్నా, ఫలితం దక్కలేదని, పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నా కూడా త్రాగునీరు అందట్లేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నభి మంగళవారం వాపోయారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు గుడిసె వాసులతో ధర్నా నిర్వహించి, మండల పరిషత్ సూపరిండెంట్ శ్రీకాంత్ కి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మన్యం మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక రోజులుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న గుడిసె వాసులకు త్రాగునీరు, కరెంటు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవని, ఇప్పటికైనా మండల అధికారులు ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మండల పార్టీ నాయకులు ఆలేటి కిరణ్ కుమార్, తాళ్లూరి కృష్ణ లు మాట్లాడుతూ తిలక్ నగర్ గ్రామపంచాయితీ లాల్ మహ్మద్ నగర్ లో సైతం త్రాగునీటి ఎద్దడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దారావత్ రాందాస్, హుస్సేన్, వెంకన్న, వీరస్వామి, సుజాత, కౌసల్య, కోటమ్మ, నీలారాణి, భవాని, హాబీబున్నిస, మలేఖా, రేష్మా, జ్యోతి, నాగమణి, లక్ష్మీ, మంగ, కల్తి మహేశ్వరి, ఆనంద్, ప్రసాద్, సరిత, సుగుణ, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.


