![]()
మంత్రి పొంగులేటి నివాసానికి దీపాదాస్ మున్షీ
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి బుధవారం ఉదయం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆహ్వానం మేరకు మున్షీ వారి నివాసానికి వెళ్లారు. ఇంటికి వచ్చిన దీపాదాస్ మున్షీని అతిథి మర్యాదలతో పొంగులేటి సత్కరించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య రాబోవు పార్లమెంట్ ఎన్నికలు తదితర రాజకీయ అంశాలపై ప్రస్తావన జరిగినట్లు తెలుస్తోంది.


