![]()
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జూలై 04
మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి సందర్భంగా మణుగూరు మండల క్షత్రియ సేవ సమితి వారి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ చేసి, పూల దండ వేసి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు


