![]()
- ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు
జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్, జులై 08
మండల పరిధిలోని అన్నారపాడు గ్రామంలో మహిళ పై దాడి చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులపై జూలూరుపాడు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అన్నారపాడు గ్రామానికి చెందిన భూక్య సౌందర్య అనే మహిళను బానోతు ప్రసాద్, భానోత్ తిరుమల, గుగులోతు రామకృష్ణ అను ముగ్గురు వ్యక్తులు అకారణంగా నోటికొచ్చిన బూతులు తిడుతూ, విచక్షణ రహితంగా కొట్టి, గడ్డ పారతో పొడిచి చంపుతామని తనను బెదిరిస్తున్నారంటూ గాయాల పాలైన బాధితురాలు భూక్య సౌందర్య ఫిర్యాదు మేరకు పై ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


