![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 15
ఇప్పుడున్న సమాజంలో పోగొట్టుకున్న వస్తువు దొరుకుడే గగనం. అలాంటి పరిస్థితిలో గుండాల తండాకు చెందిన అజ్మీరా సుమన్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. గుండాల నుండి లింగగూడెం వెళ్లే రహదారిలో చీమలగుడెం గ్రామానికి చెందిన వారి సుమారు ఇరువై వేల రూపాయల మొబైల్ బుధవారం అతనికి దొరికింది. అతను మొబైల్ ఎవరిదని కనుక్కుని బాధితుల ఇంటికి వెళ్ళి ఇచ్చి తన ఉదారతను చాటుకున్నాడు. విషయం తెలుసుకున్న మండల ప్రజలు, తండా పెద్దలు ఈ సందర్భంగా సుమన్ ని అభినందించారు.


