Monday, March 23, 2026
HomeTelangana Newsమారేడుమిల్లి అడవుల్లో మరో ఎన్ కౌంటర్

మారేడుమిల్లి అడవుల్లో మరో ఎన్ కౌంటర్

Loading

మారేడుమిల్లి అడవుల్లో మరో ఎన్ కౌంటర్

కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి..?

మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్ జీ…?

మన భద్రాద్రి న్యూస్, బ్యూరో నవంబర్ 19 : ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవి ప్రాంతంలో బుధవారం మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందిన వారంతా చతిస్గడ్ కు చెందిన వారిగా తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్ జి ఉన్నట్లు సమాచారం. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రత బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అడవిని, ఆయుధాలను వీడి లొంగిపోయి ప్రశాంతమైన జీవితం గడపాలని పలుమార్లు అధికారులు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. గడచిన సంవత్సరకాలంలో మావోయిస్టు పార్టీ భారీ నష్టాన్ని చవిచూసింది. సెంట్రల్ కమిటీ మెంబర్లు సైతం అడవిని వీడి తమ ఆయుధాలతో సహా అధికారుల ముందు లోంగిపోయారు. మరి కొందరు భావోదిస్టులు రాష్ట్ర సరిహద్దులు దాటే క్రమంలోనే ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page