![]()
హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 03
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుతున్న దృష్టా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మార్చి 15 నుండి ఒక్కపూట బడులు ప్రారంభించాలని నిర్ణయించింది.ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లు ఏప్రిల్ 23 వరకు ఒక్కపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.మార్చి 15 ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఒక్కపూట బడులు కొనసాగనున్నాయి.పదవ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహించనున్నారు.


