![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 20
మండలంలోని సాయనపల్లి గ్రామ శాఖ సభ్యులు అరెం రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను ఆదివారం సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ లు పరామర్శించి, సంతాపం తెలిపి, వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ సీపీఎం పార్టీ సభ్యుడిగా ఉంటూ అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్త మరణం పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ప్రజా ఉద్యమాలు నిర్వహించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు తోలెం గోపి, మాజీ సర్పంచ్ దుగ్గి రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.


