![]()
మే 20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఇల్లందు ఆర్టీసీ డిపో కార్మికులు పాల్గొనాలి
స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ పిలుపు.
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్
మే 20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా ఇల్లందు ఆర్టీసీ డిపో జనరల్ బాడీ సిఐటీయు కార్యాలయంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో అధ్యక్షులు ఐ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి, ఎస్డబ్ల్యూఎఫ్ ఇల్లందు డిపో కార్యదర్శి జే ఉపేంద్ర చారి లు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ కార్పోరేట్ శక్తులకు ఆకులంగా పనిచేస్తున్నారని,కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదని,ముఖ్యంగా 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానే తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అందుకోసమే ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో
తాళ్లూరి కృష్ణ ,డి అంజన్న, ఏ ఉమాదేవి, పీ లక్ష్మణ్ రావు, కే కోటయ్య తదితరులు పాల్గొన్నారు.


