Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemయువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

Loading

యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

  • ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్దే జిల్లా పోలీసుల ప్రధాన ధ్యేయం
  • జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్

దుమ్ముగూడెం, మన భద్రాద్రి

దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెల 21న ములకపాడు క్రీడా మైదానంలో మొదలయిన మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఈ రోజు ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పాల్గొన్నారు. ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ టి.సాయి మనోహర్, ఏఎస్పీ భద్రాచలం పరితోష్ పంకజ్ ఐపిఎస్ మరియు ట్రైనీ ఐపిఎస్ విక్రాంత్ సింగ్ లు పాల్గొన్నారు. నాలుగు రోజులు పాటు జరిగిన ఈ మండల స్థాయి వాలీబాల్ పోటీలకు సుమారుగా 50 టీమ్ లు పాల్గొన్నాయి. కొత్త మారేడుబాక మరియు అంజుబాక టీం లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ ను ఆసక్తితో తిలకించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత చదువుతో పాటు క్రీడల్లోను రాణిస్తూ ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. దుమ్ముగూడెం మండలం లోని ఏజెన్సీ ప్రాంత యువత కోసమే సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో పోలీసుల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించనున్నామని తెలియజేశారు. దుమ్ముగూడెం మండలం నుండి యువత క్రీడల్లో జాతీయ స్థాయి వరకు చేరుకొని ఈ ప్రాంతానికి, జిల్లాకి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశించారు. యువత జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమమే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసు శాఖ తరపున వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

దుమ్ముగూడెం మండల ప్రజలకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు స్థానిక యువత, ప్రజలు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సిఐ రమేష్, ఇన్స్పెక్టర్స్ అశోక్, ముత్యం రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజువర్మ, ఎస్సైలు గణేష్, కేశవ తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకున్న కొత్త మారేడుబాక, రెండవ బహుమతి గెలుచుకున్న అంజుబాక, మూడవ బహుమతి గెలుచుకున్న చిన్న నల్లబెల్లి టీం లు ఎస్పీ చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page