![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూలై 24
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల తక్షణ పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలలో భాగంగా గురువారం మండల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో తహసీల్దార్ రంగు రమేష్ కు వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయ, విద్యా రంగంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని, జీవో నెం. 25 ను సవరించాలని, అరవై మంది విద్యార్థులు మించితేనే ముగ్గురు ఉపాధ్యాయులు అన్న నిబంధనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని, సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, రిటైర్ అయిన ఉపాధ్యాయుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న డీఏ లను సత్వరమే విడుదల చేయాలని, పీఆర్సీ రిపోర్టు తెప్పించుకొని అమలు చేయాలని, జీవో నెం. 317 కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు స్థానికత ఇవ్వాలని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తదితర 30 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి అందజేయడం జరిగిందని వారు తెలిపారు.


