Monday, March 23, 2026
HomeInternationalరంగంలోకి భారత నౌకాదళం.. కరాచీకి చుక్కలు చూపిస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్

రంగంలోకి భారత నౌకాదళం.. కరాచీకి చుక్కలు చూపిస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్

Loading

ఇండియా పాకిస్థాన్ ఉధ్రిక్తతల మధ్య ఇప్పటి వరకు భారత వైమానిక దళం మాత్రమే పోరాడింది. కాగా ఇప్పుడు నేవీ కూడా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో భారత యుద్ధ నౌక విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. ఇండియన్ నేవీ దాడులతో కరాచీ ఓడరేవుతో పాటూ నగరం అంతా బాంబుల మోత మోగించింది. రక్షణశాఖ శాఖ సమాచారం ప్రకారం..పాకిస్థాన్ లోని కరాచీ మరియు ఒర్మారా ఓడరేవుల వద్ద విక్రాంత్ అనేక క్షిపణులను ప్రయోగించింది.

కరాచీలోని రెండు ప్రధాన ప్రాంతాల్లో దాడులకు పాల్పడగా ఓడరేవు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనతో తీరప్రాంతాల నుండి పారిపోతున్నట్టు సమాచారం. కరాచీ, ఒర్మారా పాకిస్థాన్ నేవీకి కీలకమైన స్థావరాలు. వీటిలో సీనియర్ అధికారుల కారయాలయాలు, యుద్ధ నౌకలు మరియు జలాంతర్గాములు ఉన్నాయి. వీటిని నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ నేవీని చావు దెబ్బ కొట్టింది. ఇప్పటికీ ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీలో దాడులు కొనసాగిస్తూనే ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page