![]()
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో, జులై 01
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ తో కలిసి భోజనం చేయనున్ననారు. ఈ సమావేశంలో ఏపీతో ఉమ్మడి సమస్యలపై చర్చించనున్నారు. పదేళ్లుగా ఏపీతో ఉమ్మడి ఆస్తులు, అప్పుల వ్యవహారం పెండింగ్ లో ఉంది. ఈ నెల జూన్ 2 తో హైదరాబాద్ పై ఉమ్మడి రాజధాని హక్కులు ముగిశాయి. కాగా ఇటీవలే గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. అంతేగాక ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతో పాటు నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశం కూడా చర్చలోని రానుందని సమాచారం. వీటితో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవశాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆశావాహుల్లో ఈ భేటీ తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. ఇదిలా ఉంటే కొత్త మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకుంటారు. ఏ ప్రాతిపధికన తీసుకుంటారు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త వాళ్లకు అవకాశం ఇస్తారా? లేక గతంలో మంత్రి పదవులు చేసిన వారికే మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారా అనేది ప్రశ్నార్ధకం అయ్యింది.


