![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 20
మండలంలో రేపు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారని పీఎస్ఆర్ – పీవీ ఆర్ కాంగ్రెస్ పార్టీ కో – ఆర్డినేటర్ ఎస్కే ఖదీర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని కాచనపల్లి గ్రామపంచాయతీ జగ్గుతండా నుండి లక్ష్మీదేవిపల్లి వరకు బీటీ రోడ్డు శంకుస్థాపన, తురుబాక గ్రామంలో ఇందిరమ్మ ఇల్లులకు భూమి పూజా, చీమలగూడెం ఆర్ అండ్ బీ రోడ్డు నుండి ఇప్పలగుంపు బీటీ రోడ్డుకు శంకుస్థాపన మరియు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఖదీర్ తెలిపారు.


