Tuesday, March 24, 2026
HomeHyderabadరేషన్‌ కార్డులు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్‌

రేషన్‌ కార్డులు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్‌

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ నేటితో ముగియనుంది. ఇవాళ కాకుంటే.. మళ్లీ సెప్టెంబర్‌లోనే రేషన్‌ ఇస్తారు. ప్రతి నెలలో మొదటి 15 రోజులు రేషన్‌ బియ్యం పంపిణీ ఉంటుంది.

కానీ వర్షాకాలం కావడంతో కొండలు, గిరిజన ప్రాంతాల ప్రజల ఇబ్బందుల దృష్ట్యా 3 నెలల (జూన్‌, జులై, ఆగస్టు) రేషన్‌ బియ్యం ఈ నెలలోనే అందించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. దీంతో కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా జూన్‌ 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమైంది.ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున 18 కిలోలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 94.34లక్షల రేషన్‌ కార్డులు ఉండగా వీటిపై 3.6కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. రాష్ట్రంలో మాత్రం సన్నబియ్యం ఇవ్వడం విశేషం. కాగా ఇవాళ్టితో మూడు నెలల కోటా బియ్యం పంపిణీ పూర్తి కానుంది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో రెండు నెలల పాటు రేషన్‌ షాపులు క్లోజ్‌ కానున్నాయి. మళ్లీ సెప్టెంబర్‌లో బియ్యం పంపిణీ చేయనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page