![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మార్చి 30
మండల కేంద్రంలో ప్రతీ మంగళవారం నిర్వహించే వారాంతపు సంత 2024 – 2025 సంవత్సరానికి వేలం పాటను శనివారం గుండాల గ్రామపంచాయతీ కార్యాలయంలో వేలం వేశారు. ఈ వేలం పాటలో తొమ్మిది మంది పోటీ పడగా వారాంతపు సంతను అత్యధికంగా రూ. లక్షా రెండు వేలకు వేలం పాడిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన సనప సుగుణారావు కైవసం చేసుకున్నారు. ఈ వేలం పాటలో మండల ప్రత్యేకాధికారి ఎస్ వి సత్యనారాయణ, గ్రామపంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ సింగ్ ఠాగూర్, గోవింద నర్సింహారావు, కోశాధికారి పెంటయ్య, మాజీ సర్పంచ్ కోరం సీతారాములు, గ్రామపంచాయతీ సిబ్బంది నాగరాజు, నిట్టా అనీల్, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.


