Monday, March 23, 2026
HomeAndhra Pradeshలిక్కర్ ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు - అక్కడే అసలు ట్విస్ట్, ఏం జరగనుంది..?

లిక్కర్ ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు – అక్కడే అసలు ట్విస్ట్, ఏం జరగనుంది..?

Loading

ఏపీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: సంచలనంగా మారిన లిక్కర్ ఛార్జ్ షీట్ లో సిట్ పలు మార్లు మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావన చేసింది. కోర్టుకు సమర్పించిన ప్రాధమిక ఛార్జ్ షీట్ లో వైసీపీ హాయంలో మద్యం పాలసీ పైన తీసుకున్న నిర్ణయాల నుంచి ఎఫ్ఎస్ఎల్ నివేదికల వరకు పూర్తి సమాచారం పొందుపర్చింది.

268 మంది వాంగ్ములాలు.. నిందితుల స్టేట్ మెంట్లను అందులో వివరించింది. కాగా, ఇదే కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసారు. ఇప్పుడు జగన్ పేరు ప్రస్తావనతో నెక్స్ట్ జరిగేదేంటి. ఇప్పుడు ఈ చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.

జగన్ పేరు ప్రస్తావన

లిక్కర్ కేసులో సిట్ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో మిథున్ రెడ్డి పేరు లేదని తెలుస్తోంది. అదే విధంగా ఇప్పటికే అరెస్ట్ అయిన ధనుంజయ్‌ రెడ్డి,కృష్ణమోహన్‌ రెడ్డి,బాలాజీ గోవిందప్ప పేర్లు కనిపించ లేదు. తదుపరి చార్జిషీట్లో చేరుస్తామని సిట్‌ చెబుతోంది. 20 రోజుల్లో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. అయితే, ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ప్రాధమిక ఛార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేరును పలుచోట్ల ప్రస్తావించినట్లు తెలిసింది. శని వారం అరెస్టు చేసిన వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి పేరును కూడా చార్జిషీటులో సిట్‌ ప్రస్తావించినట్టు సమాచారం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి(ఏ-1) అప్పటి ఎక్సైజ్‌ అధికారులు, డిస్టిలరీల యజమానులతో కలిసి మిథున్‌రెడ్డి (ఏ-4) ఈ కుంభకోణాన్ని ఎలా నడిపించారనేది కోర్టుకు సిట్‌ వివరించింది.

కీలక ఆధారాలు

కాగా, సీఎం మాజీ కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి, జగన్‌ మాజీ ఓఎ్‌సడీ కృష్ణమోహన్‌ రెడ్డి, భారతి సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ సహా 22మంది పాత్రని చార్జిషీట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు. అతి త్వరలో మరో చార్జిషీట్‌ దాఖలు చేయబోతున్నామని, అందులో మరికొందరి నిందితుల పాత్రని ఆధారాలతో సహా చూపుతామని సిట్‌ వర్గాలు చెబు తున్నాయి. విచారణలో భాగంగా సేకరించిన ఆధారాల గురించి వివరించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల నెట్‌వర్క్‌ ఏర్పాటు, ఆదాన్‌ డిస్టిలరీని స్వాధీనం చేసుకుని పాలసీకి భిన్నంగా రూ.1200కోట్ల మద్యం ఆర్డర్లు పొందిన వైనం, వసూలు చేసిన మొత్తాన్ని రూటింగ్‌ చేసిన తీరుపై వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. ఎక్సైజ్‌ అధికారుల తో పాటు సాక్షులు ఇచ్చిన 268 స్టేట్‌మెంట్లు చార్జిషీట్‌తో పా టు కోర్టుకు అందజేసిన సిట్‌ అధికారులు, లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన రూ.62.85 కోట్లు జప్తు చేసినట్లు తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page