Wednesday, March 25, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవరదలపై గ్రామస్థులతో సమావేశం నిర్వహించినసీఐ

వరదలపై గ్రామస్థులతో సమావేశం నిర్వహించినసీఐ

Loading

అశ్వాపురం, మన భద్రాద్రి న్యూస్

మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంలో స్థానిక సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వర్షాకాలం దృష్ట్యా వచ్చే వరదలపై తీసుకోవాల్సిన తగు చర్యలకు సోమవారం గ్రామస్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రమాదాలపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనే విషయాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు కలిగినా అధికారులకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్, గ్రామ పెద్దలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page