![]()
👉వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న చండ్రుగొండ మండల ప్రజలు
👉చండ్రుగొండ, మన భద్రాద్రి, జూన్ 03
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలంలో గత రెండు రోజుల నుంచి వరుస దొంగతనాలు జరగడంతో మండలంలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో శనివారం రాత్రి అర్ధరాత్రి 10 గంటల సమయంలో ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర హుండీని పగలగొట్టి సుమారు ఐదు నుంచి పదివేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారని, అది జరిగిన ఒక్క రోజులోనే ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బెండాలపాడు గ్రామంలో భక్తాంజనేయ స్వామి గుడి వద్ద దొంగలు హుండీని పగల కొట్టి 10 నుంచి 15 వేల రూపాయల మధ్యలో ఉన్న నగదును దొంగిలించారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇలా ఊరు చివర ఉన్న దేవాలయాలపై దొంగలు విరుచుకు పడుతున్నారని ,ఇలానే గడిస్తే ఇళ్లల్లో కూడా వస్తారేమోనని భయంతో మండల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖ వారిని కోరుతున్నారు.


