![]()
విద్యార్థులకు ఇంటర్మీడియట్ పునాది లాంటిది
- వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న బూర్గంపహాడ్ ఎస్సైలు
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
బూర్గంపహడ్ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 30వ తేదిన జరిగిన ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సందర్భంగా బూర్గంపాడు జూనియర్ కళాశాల విద్యార్థులకు భద్రాద్రి జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు సందీప్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు మొదటి బహుమతి సుశ్రిత, రెండవ బహుమతి మేఘన, మూడో బహుమతి సంజన, అదేవిధంగా గెలుపొందిన సుస్మిత, సమ్రిన్ లకు బహుమతులను స్థానిక ఎస్సైలు రాజ్ కుమార్, నాగబిక్షం చేతుల మీదుగా అందించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సై రాజకుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ పునాది లాంటిది అని, ఇంటర్ లో ఎంతగా చదివితే, భవిష్యత్తు అంత అద్భుతంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు, జుదాలకు దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ఒకటి రెండుసార్లు చదివిన పాఠాలను మరోసారి చదువుతూ సమయాన్ని వృధా చేయకూడదని అన్నారు. విద్యార్థులతో ఎస్సై రాజకుమార్ తన ఇంటర్మీడియట్ రోజులు గుర్తుచేస్తూ ఆనాటి కష్టాన్ని తెలిపారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


