![]()
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
మండలంలోని సారపాక గ్రామం వాసవి కన్వెన్షన్ హాల్ లో ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపహాడ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది(నూతన సంవత్సరం) సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరైనారు. అనంతరం ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్ల కోసం విలేకరులు ఎమ్మెల్యే పాయంకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సమాజంలో విలేకరులు పోషిస్తున్న పాత్ర చాలా కీలకమైనదని, తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పాత్రికేయులు ముఖ్య పాత్ర పోషించారని ఈ సందర్భం గుర్తు చేశారు. మండలంలో ఉన్న విలేకరులందరికీ ఆయన ఆరోగ్య భీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, పత్రికేయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


