![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ జగన్ ప్రతిపక్ష హోదా తెరపైకి రావడం, హైకోర్టులో పిటిషన్లు, వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించేందుకు సమాలోచనల నేపథ్యంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి బయటికి పోయే నేతలే తప్ప ఆ పార్టీలోకి వచ్చే వారే కరువయ్యారు. ఇలాంటి సమయంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన కూటమి పార్టీల నేతలు ఇవాళ వైసీపీలో చేరారు.జగన్ డిజిటల్ బుక్ లాంఛ్, ఎన్నికలకు సిద్దం – ఇక పోరాటమే..!!గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ, టీడీపీ నాయకులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ వైసీపీలో చేరిన వారిలో కె.ఆర్.మురహరి రెడ్డి (ఎమ్మిగనూరు బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్), కిరణ్ కుమార్ (బీజేపీ ఎమ్మిగనూరు టౌన్ ప్రెసిడెంట్), మాల మధుబాబు (టీడీపీ మాజీ కౌన్సిలర్ – ఎమ్మిగనూరు), చేనేత మల్లికార్జున (టీడీపీ ఎమ్మిగనూరు సిటీ జనరల్ సెక్రటరీ) ఉన్నారు.


