Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemశ్రావణమాస బోనం ఎత్తిన మహిళలు

శ్రావణమాస బోనం ఎత్తిన మహిళలు

Loading

-మండల కేంద్రంలో నెలకొన్న పండుగ వాతావరణం

గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 10

మండల కేంద్రంలో ఆదివారం మహిళలంతా ఆదివారం డప్పు చప్పులతో శ్రావణమాస బోనాల వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు ఉదయాన్నే ఇళ్లు, వాకిలిని శుభ్రం చేసుకుని, గుమ్మాలకు మామిడాకులు, వేప మండలతో తోరణాలు కట్టుకుని, బొడ్రాయికి అభిషేకాలు చేసిన అనంతరం ముత్యాలమ్మకు నైవేద్యాలు వండుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామంలోని జనులంతా ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో విలసిల్లాలని మహిళలు అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందడితో ఆదివారం మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page