![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో 6 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్‌ఫ్లో 2,39,601 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 2,28,900 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


