![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: సనత్‌నగర్‌లోని జింకలవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్ ఇండస్ట్రీస్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించడంలో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో నల్లని పొగ దట్టంగా అలముకున్నది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్ఇంజన్లు, రోబో సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.


