![]()
ఏజెన్సీల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న మావోలు
-గుండాల సీఐ ఎల్ రవీందర్
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 29
ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలను అభివృద్ధికి దూరం చేసే మావోయిస్టులను గ్రామాలలోకి రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల సీఐ ఎల్ రవీందర్ బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని ఘణాపురం, సాయనపల్లి, చిన్న వెంకటాపురం, దామరతోగు గ్రామాలలో మావోయిస్టుల ఫొటోలతో కూడిన గోడ పత్రికలను పోలీస్ సిబ్బంది అంటించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మావోయిస్టుల సమాచారం అందిస్తే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బహుమతులు అందజేస్తామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని, వారికి ప్రభుత్వం, పోలీస్ శాఖ తరపున పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టుల గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని కోరారు. పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.


