Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemసమాజంలో వెనుకబడిన పిల్లలకు ఉచిత విద్యను అందించాలి

సమాజంలో వెనుకబడిన పిల్లలకు ఉచిత విద్యను అందించాలి

Loading

-సామాజిక కార్యకర్త కర్నె రవి

మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జూన్ 10

మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారి పిల్లలకు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి పిల్లలకు, తండ్రి చనిపోయిన నిరుపేద పిల్లలకు విద్యా హక్కు చట్టం ప్రకారం ఖాళీ అయిన స్థానంలో ఈ విద్యా సంవత్సరానికి తిరిగి పునరుద్దరణ చేయాలని సోమవారం సామజిక కార్యకర్త కర్నె రవి విద్యాశాఖ అధికారికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా కర్నె రవి మాట్లాడుతూ గత సంవత్సరం 86 మంది పిల్లలకు విద్యా హక్కు చట్టం ప్రకారం లబ్ది పొందారని, అందులో పదవ తరగతి పరీక్షలు ఉత్తీర్ణత చెంది, ఏడుగురు విద్యార్థులు బయటకు వెళ్లారని, తిరిగి వారి స్థానంలో ఈ విద్యా సంవత్సరానికి నిరుపేద పిల్లలను తిరిగి పాఠశాలలోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page