Monday, March 23, 2026
HomeTelangana Newsసమితి సింగారం ఓటర్ల దృష్టంతా కాంగ్రెస్, సిపిఐ వైపు!

సమితి సింగారం ఓటర్ల దృష్టంతా కాంగ్రెస్, సిపిఐ వైపు!

Loading

“సమితి సింగారం ఓటర్ల దృష్టంతా కాంగ్రెస్, సిపిఐ వైపు… MLA పాయం వెంకటేశ్వర్లు గారు పవర్ఫుల్ ప్రచారం!

తేది: 08/12/2025

🔷 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి అజెండాను మరింత బలపరిచే దిశగా పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు కాంగ్రెస్, సిపిఐ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రజల్లో నూతన స్పూర్తిని నింపారు. సిపిఐ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కలబోయిన మాధవరావు గారిని గెలిపించి గ్రామం అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజల్ని కోరుతూ, గ్రామంలోని ప్రతి వార్డును సందర్శిస్తూ విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే 7వ వార్డు అభ్యర్థి యిలగాల మంగతాయి, 8వ వార్డు అభ్యర్థి బిరుదురాజు శ్రీదేవి , 9వ వార్డు సిపిఐ పార్టీ అభ్యర్ధి వజ్జ వెంకటేశ్వర్లు ఈ వార్డుల సభ్యుల అభ్యర్థులకు భారీగా ప్రజా మద్దతు లభించే విధంగా ఇంటింటికీ చేరి అభివృద్ధి కార్యాచరణను వివరించారు. ప్రజాస్వామ్యం బలోపేతానికి, పారదర్శక పంచాయతీ పాలనకు కాంగ్రెస్ – సిపిఐ కలయిక అనివార్యమని తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు.

🔷ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి సందర్శనతో గ్రామంలో ఎన్నికల వేడి మరింత పెరిగి, కాంగ్రెస్, సిపిఐ అభ్యర్థుల పట్ల మంచి సానుకూల వాతావరణం నెలకొంది. గ్రామం అభివృద్ధి, సామాజిక న్యాయం, సమగ్ర సంక్షేమం కోసం ప్రజలు కాంగ్రెస్ మరియు సిపిఐ అభ్యర్థులకు బలమైన మద్దతు ఇస్తున్న తీరు ప్రచారంలో స్పష్టంగా కనిపించింది.

🔷 ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్ గారు, మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page