![]()
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో, జూలై 21
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు ఆలయ కమిటీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీతక్క మాట్లాడుతూ మహంకాళీ అమ్మవారి దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని, ప్రజలంతా చల్లాగా ఉండేలా చూడాలని కోరుకున్నానని తెలిపారు. పూర్వం నుంచి వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగించడం గొప్ప వరమని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.


