![]()
-మహిళలకు నెలకు రూ. 2500పై నిర్ణయం తీసుకునే అవకాశం
హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 12
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది.మహిళా సాధికారత అంశాలే ప్రధానంగా ఉండనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఈ సమావేశంలో మహిళలకు నెలకు రూ. 2500పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.అలాగే SHG మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, రూ. 5 లక్షల జీవిత భీమా, కొత్త రేషన్ కార్డులపై నిర్ణయాలు తీసుకోనున్నారు.సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే మహిళా శక్తి సభలో ఈ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.


