Tuesday, March 24, 2026
HomeTelangana Newsసీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ

సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ

Loading

సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ‘భారతమాల’ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న వివిధ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం ఎన్‌హెచ్‌ఏఐకి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ఇక, హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్‌ టవర్లు, స్తంభాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్‌) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్‌ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page