![]()
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహించండి
-మున్సిపల్ కమిషనర్ స్వామి
పాల్వంచ, మన భద్రాద్రి న్యూస్, జూలై 21
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం పాల్వంచ మున్సిపల్ కమిషనర్ స్వామి తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, డ్రైనేజీలు పొంగి పొరలుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లోకి పాములు, క్రిమి కీటకాలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండి దోమలు, ఈగలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని కోరారు.


