![]()
తెలంగాణ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో వార్డుల విభజన చేయాలని పేర్కొంది. కాగా ఎన్నికల నిర్వహణకు 30 రోజుల సమయం కావాలని ప్రభుత్వం, 60 రోజుల గడువు కావాలని HCని SEC కోరిన విషయం తెలిసిందే. దీంతో సర్పంచి, MPTC, ZPTC ఎలక్షన్స్ సెప్టెంబర్ లోపు జరగనున్నాయి.


