Tuesday, March 24, 2026
HomeSports Newsసొంతగడ్డపై తేలిపోయిన తెలుగు టైటాన్స్

సొంతగడ్డపై తేలిపోయిన తెలుగు టైటాన్స్

Loading

ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. సొంతగడ్డపైనైనా ఆట తీరు మారుతుందేమో అనుకుంటే మళ్లీ అదే వైఫల్యం.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ చేతిలో 42-26 తేడాతో టైటాన్స్ చిత్తుగా ఓడింది. కెప్టెన్ పవన్ 7 పాయింట్లతో రాణించగా.. మిగతా ఆటగాళ్లు తేలిపోవడంతో ఓటమి తప్పలేదు. అయితే, మ్యాచ్‌లో మొదట ఆధిపత్యం టైటాన్స్‌దే. ఫస్టాఫ్‌లో ఆ జట్టు 12-9తో ఆధిక్యంలో నిలిచింది. కానీ, సెకండాఫ్‌లో పట్టు కోల్పోయి బెంగళూరుకు అవకాశాలు ఇచ్చింది. దూకుడుగా ఆడిన బెంగళూరు ఆటగాళ్లు మూడు సార్లు టైటాన్స్‌ను ఆలౌట్ చేశారు. మరోవైపు, పాయింట్లు తేవడంలో తేలిపోయిన టైటాన్స్ మ్యాచ్‌ను బెంగళూరుకు సమర్పించుకుంది. బెంగళూరు జట్టులో అక్షిత్ 9 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 7 పాయింట్లు, వికాస్ 6 పాయింట్లతో రాణించారు. తెలుగు టైటాన్స్‌కు ఇది వరుసగా ఇది ఏడో పరాజయం. మొత్తంగా 12వ ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున కొనసాగుతోంది. మరోవైపు, పాట్నా పైరేట్స్ నాలుగు మ్యాచ్‌ల తర్వాత విజయాన్ని అందుకుంది. యూపీ యోధాస్‌పై 31-34 తేడాతో విజయం సాధించింది.

Source : Disha

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page