![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పెద్దఅంబర్‌పేట నుంచి బొంగ్లూరు వెళ్తుండగా ఆదిభట్ల ఓఆర్ఆర్పై ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల వివరాలు, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


