![]()
ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి
- మీ కొరకు మీ కుటుంబం ఎదురు చూస్తుంది
- ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్
టేకులపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాలు నివారణ కార్యక్రమాన్ని మంగళవారం టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై రాజేందర్ ల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు నుండి సులానగర్ అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాదారులు సహకరించాలని, హెల్మెట్ వల్ల ప్రమాదాల నివారణ ఉంటుందని, ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించి రోడ్డు సేఫ్టీ నిబంధనలను పాటించాలని మీ కొరకు మీ కుటుంబం ఎదురు చూస్తుందని అన్నారు, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని కోరారు. అనంతరం పలువురికి హెల్మెట్ లను అందించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లీశ్వరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవా నాయక్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, సర్పంచ్ గూగులోత్ లక్ష్మానాయక్, సర్పంచ్ పూల బంతి, బొడ్డు అశోక్, అజ్మీర శివ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


