Wednesday, April 15, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemభవిత కేంద్రాల నిర్మాణ పనులను త్వరితగతన పూర్తి చేయాలి

భవిత కేంద్రాల నిర్మాణ పనులను త్వరితగతన పూర్తి చేయాలి

Loading

భవిత కేంద్రాల నిర్మాణ పనులను త్వరితగతన పూర్తి చేయాలి.. జిల్లా విద్యా శాఖ సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ యస్. కె. సైదులు.

ఈరోజు బూర్గంపాడు మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బూర్గంపాడులో నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాల మొరంపల్లి బంజర మరియు ప్రాథమిక పాఠశాల, గౌతపురం నందు నిర్మాణం లో ఉన్న దివ్యంగ పిల్లల టాయిలెట్స్ లను పరిశీలించారు.

సివిల్ పనులు చాలా నిదానంగా నడుస్తున్నాయని, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి భవిత కేంద్రాలను, CWSN టాయిలెట్లను దివ్యాంగ పిల్లలకు వినియోగం లోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎఫ్.ఎల్.ఎస్ సర్వేను, మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్శనలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు, యస్. కె. సైదులు ఏ.నాగరాజు శేఖర్, మండల విద్యాధికారి యదుసింహరాజు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉషారాణి , స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page